ఆడవాళ్ళ ఈ పని చేయకపోతే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు..!!

చాలామంది లక్ష్మీదేవిని ఇలవేల్పుగా కొలుస్తారు. డబ్బుకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. చాలామంది ధనవంతులు సైతం లక్ష్మీదేవిని ఇంట్లో ఎన్నో పూజలు చేస్తూ కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ లక్ష్మీ తమ ఇంట్లోనే ఉంటుంది అని భావిస్తారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్లు ఈ పనులు అస్సలు చేయకూడదట. మరి ఆడవాళ్లు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆడవాళ్లు ఇంట్లో అందంగా ముస్తాబై తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా సంతోషమట.అలాగే శుక్రవారం పూట ఆడవారు తల స్నానం చేసి ఇల్లును శుభ్రం చేసి ఆ లక్ష్మీదేవిని కొలిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటుందట. అంతేకాకుండా సాయంత్రం పూట ఇంటి తలపులను అస్సలు వేసి ఉంచరాదు. సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారు చాలామంది.

అలాగే ఆడవాళ్లు ఉదయమే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుందట. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఉంటేనే లక్ష్మీదేవి నిలుస్తుందట. లేకపోతే చీటికిమాటికి భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదట.

అలాగే ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టపడుతూ పని చేసే వాళ్ళింట్లో కచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది.లక్ష్మీదేవిని ప్రతిరోజు క్రమం తప్పకుండా నిష్ఠతో కొలిస్తే సిరి సంపదలు ఇంట్లో ఉంటాయి. ఇక ఎంత పెద్ద వారైనా సరే కింద స్థాయి నుండే వస్తారు. అందుకే చాలామంది లక్ష్మీదేవిని చాలా నిష్ఠతో కొలుస్తారు. ఇక లక్ష్మీదేవి నిలవాలంటే పైన చెప్పినవన్నీ పాటిస్తే ఖచ్చితంగా నిలుస్తుంది.