త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భాజాలు మోగ నున్నాయి. పెళ్లి సంబంధాలు కుదిరినా కానీ ముహూర్తాలు లేకపోవడం తో చాలామంది వేచి చూస్తున్నారు. త్వరలో నే గురు మూడమీ విడనుండడం తో భాజా భజంత్రీల కు మంచి కల రాబోతోంది. మరోవైపు బ్యాచిలర్స్ కూడా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్నారు.
అలాంటి వారి కి ఇదొక శుభ వార్త అని చెప్పవచ్చు. పెళ్లంటేనే ఒక సందడి వాతావరణం.. హడావిడి.. ఇక పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటే చాలు హడావిడి మామూలు గా ఉండదు. వంట మనుషులు, సౌండ్ సిస్టం, లైటింగ్, డెకరేషన్, ఇతరత్రా అనేక పనుల కోసం ఆర్డర్స్ పెట్టుకుంటారు. బంధుమిత్రుల కు స్నేహితుల కు సమాచారం అందిస్తారు..
మరి ఈ ఏడాది అద్భుత ముహూర్తాలు ఏంటో చూద్దామా.. మే, జూన్ నెల లో ఎక్కువ గా ముహూర్తాలు ఉండడం విశేషం. మే నెల లో 3, 4, 5, 6,7 ,10, 11, 12, 13, 14, 20, 21, 26, 27, 31 తేదీలలో ముహూర్తాలు ఉన్నాయి. ఇక జూన్ లో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 14 తేదీల లో అద్భుత ముహూర్తాలు ఉన్నట్టు పురోహితులు తెలియజేస్తున్నారు.
ఇక మే, జూన్ నెల లో తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యల్లో వివాహాలు జరగవచ్చు. దీని కి ప్రధాన కారణం ఎక్కువ మంది కి సరిపోయే నక్షత్రాలు ఉండడమే దీనికి కారణం. దీని కోసం ముందుగానే కళ్యాణ మండపాలు బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం.