Vasthu Tip’s : మీ ఇంట్లో అద్దం ఆ ప్లేస్ లో పెడుతున్నారా.. అయితే దురదృష్టమే..!!

చాలామంది జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక వాస్తు ప్రకారమే ఇంట్లో ఉండే గదులను కట్టుకుంటూ ఉంటారు. కిచెన్, హాల్, బెడ్ రూమ్, పూజ రూమ్, బాత్రూం ఇలా ఏ ఒక్కటి కట్టాలన్న ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారమే కట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇంట్లో పెట్టుకునే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే ఏవి ఎక్కడ పెట్టాలో చూసుకొని పెట్టుకుంటారు.

అయితే ఇంట్లో అద్దం ఆ ప్లేస్ లో ఉంటే కచ్చితంగా ఇంట్లో అన్ని అనర్ధాలు జరుగుతాయట. ఇక విషయంలోకి వెళ్తే విరిగిన అద్దాలను,పగిలిన అద్దాలను, చెడిపోయిన అద్దాలను ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట. మన ఇంట్లో పెట్టుకునే అద్దంలోనే వాస్తు ఉంటుందని చాలామంది వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అలాగే మన ఇంట్లో ఉండే అద్దం మన తలరాతను మార్చేస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే అద్దాన్ని మన ఇంట్లో సరైన దిశలో పెట్టుకోకపోతే కచ్చితంగా ఇంట్లో అనర్ధాలు జరుగుతాయట. అంతేకాదు ఈ అద్దాన్ని సరైన దిశలో పెట్టకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చి ఇంట్లో అన్ని అనర్ధాలే జరుగుతాయట.

ఇక బెడ్ రూమ్ లో అద్దం పెట్టుకునేటప్పుడు మంచానికి ఎదురుగా అద్దాన్ని అస్సలే ఉంచకూడదట. అలా మంచానికి ఎదురుగా అద్దాన్ని ఉంచడం వల్ల ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయట. అందుకే ఏదైనా తెలియని పని చేసేటప్పుడు అది మంచో చెడో తెలియడానికి పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు.