LPG Gas booking: వాట్సాప్‌ ద్వారా గ్యాస్ ని ఇలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు..!!

Earn with Whatsapp channel
Earn with Whatsapp channel

ప్రతినెలా గ్యాస్ సిలిండర్ ని (LPG Gas booking) బుక్ చేసుకోవడం పెద్ద సమస్యగా ఉంటుంది చాలా మంది గ్యాస్ సిలిండర్ ని గంటల తరబడి క్యులలో నిలబడి బుక్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా టెక్నాలజీ రావడంతో ఈజీగా మనం స్మార్ట్ ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నిజానికి టెక్నాలజీ ఈ రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాంతో ఈజీగా మన పనులు పూర్తవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సులభంగా ఏ పనైనా అయిపోతుంది.

ఇంటర్నెట్ స్పీడ్ పెరిగిన తర్వాత గ్యాస్ బుకింగ్ ఇంకా ఈజీ అయిపోయింది గ్యాస్ సిలిండర్ ని బుక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. క్షణాల్లో మనం సిలిండర్ ని బుక్ చేసుకోవచ్చు. మన దేశంలో LPG గ్యాస్ సిలిండర్లని సరఫరా చేసేది హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్, భారత్ పెట్రోలియం భారత్ గ్యాస్. అయితే ఇవి వినియోగదారులు ఈజీగా ఆన్లైన్ లో ఎల్పీజీ సిలిండర్ ని బుక్ చేసుకుని సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

దాంతో క్షణాల్లో సిలిండర్ అనే బుక్ చేసుకోవచ్చు గ్యాస్ సిలిండర్ లని కాలింగ్ ద్వారా వెబ్సైట్ల ద్వారా మొబైల్ యాప్ ద్వారా యూపీఐ, డిజిటల్ వాలెట్ వాట్సప్ ద్వారా కూడా బుక్ చేయొచ్చు. ఇక వాట్సప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. భారతీయ కంపెనీ వాట్సాప్ ద్వారా LPG గ్యాస్ సిలిండర్ కోసం 7588888824 నంబర్‌ను తీసుకొచ్చింది. HP సిలిండర్ కావాల్సిన వారు 771895555, 9222201122 నెంబర్ల తో క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్లో ఈ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.

ముందు మీరు మీ ఫోన్ నుండి ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ ని పంపండి. తర్వాత ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అక్కడ గ్యాస్ బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ చేశాక. గ్యాస్ బుకింగ్ అయినట్లు మీకు మెసెజ్ వస్తుంది. బుకింగ్ నెంబర్, సిలిండర్ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాలు మీ వాట్సాప్ కి వచ్చేస్తాయి.LPG