New House : కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. ఖర్చు ఇలా ఉంటుంది..!!

మన ఇండియాలో ఒక సామెత ఉంది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని..ముఖ్యంగా మనిషి జీవిత గమనంలో ఇల్లు అనేది చాలా ప్రముఖమైనది. ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే మధ్య తరగతి వారు ఎన్నో ఇబ్బందులు పడతారు. అయినా కష్టపడి వారి కలల ఇల్లును నిర్మించుకుంటారు. కానీ ఈ రోజుల్లో పట్టణాల్లో ఒక ఫ్లాట్ కొనాలంటే 30 నుంచి 40 లక్షల వరకు అవుతోంది.

ఆ ఫ్లాట్ లో ఇక ఇల్లు కట్టాలంటే ఇళ్లు రేంజ్ ను బట్టి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలు కూడా కావచ్చు. మరి మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా.. మరి హైదరాబాదులో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనం ఓసారి తెలుసుకుందాం.. సాధారణంగా హైదరాబాద్ నగరంలో మూడు సెంట్ల స్థలంలో అంటే 144 గజాల లో ఇల్లు కట్టుకోవాలి.

ఈ ఇంటి నిర్మాణంలో మూడు గ్రేడ్లు ఉంటాయి.ఒకటి బేసిక్ రెండవది మీడియం మూడవది ప్రీమియం. బేసిక్ గ్రేడ్ అయితే 15 లక్షల్లో అయిపోతుంది. మీడియం గ్రేడ్ అయితే 19 లక్షల్లో ఇల్లు అయిపోతుంది. ఇక ప్రీమియం గ్రేడ్ లో ఇల్లు కట్టుకోవాలంటే 23 లక్షలు అవుతుంది. మనం ఇల్లు కట్టుకునే ముందు నిర్మాణ శాతం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

హోమ్ డిజైన్, అప్రూవల్: 2.5%

రూఫ్ స్లాబ్: 13%

ఫుటింగ్ మరియు ఫౌండేషన్: 12%

నీటి సరఫరా, ప్లంబింగ్ పని: 5%

ఇటుకల పని, ప్లాస్టరింగ్: 17%

ఫ్లోరింగ్ అండ్ టైలింగ్: 10%

ఆర్సీసీ వర్క్, స్తంభాలు, కాలమ్స్, స్లాబ్స్: 10%

ఎక్స్కవేషన్ (తవ్వకాలు): 3%

తలుపులు, కిటికీలు: 8%

ఎలక్ట్రిక్ వైరింగ్: 8%

బేసిక్ గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే:

మెటీరియల్ ధరలు: రూ. 15,17,938-

స్టీల్: రూ. 1,90,512/- (4536 కిలోలు)

సిమెంట్: రూ. 2,07,036/- 583 బ్యాగులు.

ఇటుకలు: రూ. 1,47,744.

కాంక్రీట్: రూ. 66,484/- 2,462 క్యూబిక్ ఫీట్లకు.

ఇసుక: రూ. 98,496/- (2592 క్యూబిక్ ఫీట్లకు

ఫ్లోరింగ్: రూ. 86,832/- 1296 చదరపు అడుగులకు.

తలుపులు: రూ. 66,951/- 233 చదరపు అడుగులకు

శానిటరీ ఫైటింగ్స్: రూ. 90,720/- 1296 చదరపు అడుగులకు

కిటికీలు: రూ. 48,911/- (220 చదరపు అడుగులకు.

ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్: రూ. 10,692/- 194 చదరపు అడుగులకు.

కాంట్రాక్టర్(ఆర్సీసీ, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్): రూ. 3,04,560/- 1296 చదరపు అడుగులకు.

కిచెన్ వర్క్: రూ. 43,480/- 71 చదరపు అడుగులకు.

పెయింటింగ్: రూ. 1,55,520/- 7,776 చదరపు అడుగులకు.