భారతదేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రంతో పాటు స్వప్న శాస్త్రం,వాస్తు శాస్త్రం, కళాశాస్త్రం వంటి వాటిని నమ్ముతుంటారు. అంతే కాదు కొంతమంది అయితే ఏ పని చేసినా జాతకం ప్రకారమే చేస్తారు.ఏదైనా పనుల్ని మొదలు పెట్టేటప్పుడు కచ్చితంగా జ్యోతిష్యున్ని కలిసి ఏది ఎలా చేస్తే బాగుంటుందో జ్యోతిష్యున్ని అడిగి మరీ వారు చెప్పినట్లే చేస్తారు.
అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మనం పడుకున్నాక మన కలలో ఈ వస్తువులు కనిపించినట్లయితే కచ్చితంగా మన ఇంటికి త్వరలో లక్ష్మి దేవి రాబోతున్నట్టు సూచికట. మరి కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాబోతున్నట్టు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు రంగు పండ్లు లేదా పువ్వులు : పసుపు రంగులో ఉండే పండ్లు లేదా పువ్వులు మన కలలో కనిపించినట్లయితే కచ్చితంగా మనం త్వరలో బంగారం కొనుగోలు చేయబోతున్నామని అర్థమట.
గుడి కనిపించడం: స్వప్న శాస్త్రం ప్రకారం మనం పడుకున్నాక మన కలలో గుడి కనిపించినట్లయితే త్వరలోనే మన ఇంటికి ధనం రాబోతున్నట్టు సంకేతమట.గుడి కనిపించడం అనేది కుబేరుడు కి చిహ్నమట.
లక్ష్మీదేవి : స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో లక్ష్మీదేవి కనిపిస్తే ఖచ్చితంగా మన ఇంటికి త్వరలోనే ధనం రాబోతుందని సంకేతమట.
వర్షం: స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మనకు వర్షం కనిపించిన కూడా త్వరలోనే మనకు ఏదో ఒక విధంగా ధనం రాబోతుందని అర్థమట.
పళ్ళు తోముకోవడం : స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పళ్లు తోముకున్నట్లు కనిపిస్తే అది ధనానికి సంకేతమట.ఇలా కలలో వస్తే త్వరలోనే మన ఇంటికి ధనం వస్తుందని అర్థమట.