చాలామంది జుట్టు రాలుతుండడంతో కంగారు పడుతూ ఉంటారు. రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు. అయినా జుట్టు రాలడం ఆగదు. ఇలాంటి సమస్య ఉన్నవారికి ఇంట్లో నుంచే సమస్యకు చెక్ పెట్టే మంచి చిట్కా ఇప్పుడు చూద్దాం.. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి రెండు టీ స్పూన్ ల బియ్యం, ఒక స్పూన్ లవంగాలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీళ్లను వడగట్టాలి.
ఆ నీటిని జుట్టు మూలాల నుండి కుదుళ్ళ వరకు బాగా పట్టించి గంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపుతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మీకు జుట్టు రాలే సమస్య ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. బియ్యం నీరు జుట్టును లోతుగా శుభ్రం చేస్తుంది. బియ్యం నీరులో విటమిన్ E సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు చిక్కు పడకుండా సిల్కీ గా ఉండేలా చేస్తుంది. మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది.
బియ్యం నీటిలో ఉండేటువంటి అమైనో ఆమ్లాలు జుట్టు మూలాలను బలంగా మృదువుగా మెరిసేలా చేస్తాయి. అలాగే లవంగాల్లో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది కాబట్టి ఇది జుట్టు కుదుళ్లలో రక్తప్రసరణ పెంచి జుట్టు రాలకుండా ఒత్తుగా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు నల్లగా ఉండడానికి కూడా ఇవి సహాయపడతాయి.ఫలితం గా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కా ట్రై చేయండి.