మన భారతదేశం అంటేనే ఎక్కువగా గుళ్లు,గోపురాలు, వాస్తు శాస్త్రాలను నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఏ పనైనా చేస్తూ ఉంటారు. అలాంటి వాస్తు నిపుణులు తెలిపిన దాని ప్రకారం మన బెడ్ రూమ్ లో మీరు తలను పెట్టుకునే దిశా మంచాన్ని ఉంచే దిశా బట్టి వాస్తు పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలట. మరి పడక గది లో ఏ విధంగా ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దామా..
ముఖ్యంగా బెడ్ రూమ్ లో ఈ విగ్రహం ఉంటే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పడక గదిలో రాధాకృష్ణ విగ్రహాన్ని ఉంచకూడదట. నిజానికి రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే బెడ్ రూమ్ లో వీరిద్దరి విగ్రహం ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుందట.
రాధాకృష్ణుల విగ్రహాన్ని పడకగదిలో ఉంచడం వల్ల వివాహేతర సంబంధం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇస్తుంటారు. కానీ అలా ఇవ్వకూడదట. ఎందుకంటే రాధాకృష్ణ వివాహం చేసుకోలేదు కాబట్టి వారిద్దరు ఉన్న గిఫ్ట్ ఇవ్వకపోవడమే మంచిదట. అలాగే బెడ్ రూమ్ లో గోపికల బొమ్మను కూడా ఉంచకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
రాధాకృష్ణల విగ్రహ చిత్రాలకు బదులుగా మీ పెళ్లి ఫోటోలను ఉంచుకోవాలని అంటున్నారు. అంతేకాదు మీకు ఒత్తిడి చిరాకు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి పడకగది కొరకు వాస్తు దోహదపడుతుంది. కాబట్టి గదిని నిర్మించేటప్పుడు వాస్తు దోషాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.