చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒక కల ఉంటుంది. ఇక ఇల్లు కట్టడం అనేది మామూలు విషయం కాదు.ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటుంటారు చాలామంది పెద్దలు. అందుకే ఇల్లు కట్టడం అనేది ఖర్చుతో కూడుకున్న పని.మరీ ముఖ్యంగా మన అభిరుచులకు తగ్గట్టు కట్టుకోవాలంటే .. డబ్బులు ఎక్కువగా కావాలి.
అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా న్యూ మోడల్ హోమ్స్ కడుతున్నారు. అయితే కొత్త ఇల్లు కట్టుకునేవారు హోమ్ లోన్ పెట్టి డబ్బులు తీసుకుంటారు. అయితే ఈ హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలట.లేకపోతే ప్రమాదం. మరి హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఏ విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్ పరిస్థితులు ప్రభుత్వ విధానాలు
ఆర్థిక అభివృద్ధి,ద్రవయోల్బణం, వంటి మార్కెట్ పరిస్థితులు మీరు తీసుకునే హోమ్ లోన్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపిస్తాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి తీసుకోవాలి.
డౌన్ పేమెంట్
హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు నుండి ఎంత లోన్ కావాలో ముందే లెక్కేసుకోవాలి. ఇక లోన్ మొత్తాన్ని వడ్డీ రేట్లు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వడ్డీ రేటును నిర్ణయించే విషయంలో డౌన్ పేమెంట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డౌన్ పేమెంట్ ఎక్కువ కడితే లోన్ పై తక్కువ వడ్డీ రేటు పొందడానికి అవకాశాలు ఉంటాయి.
టైం పీరియడ్
లోన్ తీసుకునేటప్పుడు లోన్ చెల్లింపు కాలం కూడా ముఖ్యమైన విషయం.ఎందుకంటే లోన్ తీసుకునేటప్పుడే తక్కువ కాలవ్యవధి అనుకుంటే తక్కువ వడ్డీ రేటు తో రుణం పొందవచ్చు.. ఒకవేళ ఎక్కువ కాల వ్యవధి అనుకుంటే ఎక్కువ రుణంతో డబ్బు పొందే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ కాల వ్యవధి తో రుణం తీసుకొని అధిక లోన్ చెల్లింపులతో హోమ్ లోన్ త్వరగా కట్టవచ్చు.
సిబిల్ స్కోర్
బ్యాంకులో లోన్ ఇచ్చే ముందు ఎక్కువగా చెక్ చేసేది సివిల్ స్కోర్. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే లోన్ అంత ఎక్కువగా పొందవచ్చు. ఇక గత క్రెడిట్ కార్డ్ బిల్లులు,లోన్ చెల్లింపులు వంటి వాటి ఆధారంగా మీ సిబిల్ స్కోర్ ని బ్యాంకు వాళ్ళు లెక్కిస్తారు. ఈ సివిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత సులభంగా లోన్లు వస్తాయి.అంతేకాకుండా సిబిల్ స్కోర్ మీ వడ్డీ రేటును కూడా నిర్ణయించడానికి పారామీటర్ గా ఉపయోగిస్తారు. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది.అందుకే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ పైన చెప్పుకునే అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకోవాలి.