సాధారణంగా చాలామంది స్త్రీలు, పురుషులు టైం దొరికితే చాలు గోర్లు కత్తిరించుకుంటూ ,స్త్రీలు హెయిర్ కటింగ్ చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. కానీ అలా చేయరాదట. గోర్లు, హెయిర్ కత్తిరించుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉందని ఆ రోజుల్లో మాత్రమే ఈ పనులు చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. మరి దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దామా..
మన పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్న సంప్రదాయం వెనుక ఏదో ఒక పరిహారం అనేది ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది స్త్రీ, పురుషులు శాస్త్రానికి విరుద్ధంగా ఫ్యాషన్, స్టైలిష్ కటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకూడదు అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. స్త్రీ,పురుషులు సమయం దొరికిన రోజున జుట్టు కత్తిరించుకుంటారు.
అలా చేసినట్లయితే అది మీ జీవితం పై ప్రభావం చూపిస్తుందని ,దీనివల్ల మీరు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటున్నారు. హిందూ సనాతన ధర్మంలో వారంలో ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఈ ఏడు రోజుల్లో బుధవారం, శుక్రవారం పవిత్రమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం జుట్టు లేదా గోర్లు కత్తిరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఈరోజు జుట్టు కత్తిరించడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు. ఆనందం కలుగుతుంది. కాబట్టి జుట్టును కత్తిరించాలనుకుంటే బుధవారాన్ని ఎంచుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈరోజు మీ జుట్టును కత్తిరించడం వల్ల మీ విజయాలు పెరుగుతాయని, ఇల్లు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో పరిమళిస్తుందని శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆది, సోమ, మంగళ, గురు,శనివారాలలో అనుకోకుండా జుట్టు,గడ్డం, గోళ్ళు కత్తిరించుకోకూడదు. దీనివల్ల మీ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందట.