చాలామంది రోజు టీ ని తాగుతూ ఉంటారు. టీ తాగితే ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయి అలానే నష్టాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా టీ ని అధికంగా తీసుకోకూడదు. లిమిట్ గా తీసుకుంటే పరవాలేదు అయితే టీ తో పాటుగా వీటిని మాత్రం అసలు తీసుకోకండి టీతో పాటుగా వీటిని తీసుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. టీ తో పాటుగా ఏ ఆహార పదార్థాలని తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
శనగపిండితో చేసిన ఆహార పదార్థాలని టీ తో పాటుగా తీసుకోకూడదు టీ తో పాటు శనగపిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలు వంటివి కలుగుతాయి కాబట్టి ఆ తప్పును చేయకండి. సలాడ్, మొలకెత్తిన గింజలు, ఉడికించిన గుడ్లు వంటివి కూడా టీ తో పాటుగా తీసుకోకూడదు వీటిని టీ తో తీసుకుంటే కూడా సమస్యలు కలుగుతాయి.
టీ తాగిన తర్వాత పసుపు ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే కూడా ఇబ్బంది టీతో పాటుగా పసుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ తప్పుని కూడా చేయకండి. టీ లో ఉప్పు బిస్కెట్లు ముంచుకుని తింటే కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి చాలామంది తెలియక సాల్ట్ బిస్కెట్స్ ని టీ లో ముంచుకుని తీసుకుంటూ ఉంటారు అది కూడా మంచిది కాదు.
నిమ్మకాయ ఉన్న టీ తో వీటిని కూడా తీసుకోకండి నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీ తో పాటుగా ఏమైనా తీసుకుంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వంటివి రావచ్చు కాబట్టి ఆ తప్పును కూడా చేయకండి. టీ తాగిన తర్వాత మంచి నీళ్లు తీసుకోవద్దు. చల్లటి పదార్థాలని కూడా తీసుకోవద్దు. ఐస్ క్రీమ్ వంటి వాటిని టీ తీసుకున్న తర్వాత తీసుకోకండి. టీ తో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం కూడా మంచిది కాదు కాబట్టి ఈ తప్పులను అస్సలు చేయకండి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.