స్నానం చేసే నీటిలో ఇవి వేస్తే లక్ష్మీదేవి మీ తలుపు తట్టడం ఖాయం..!!

చాలామంది ఎంత కష్టపడ్డప్పటికీ కూడా వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. కొంతమంది అడ్డదారులు తొక్కుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏ పని చేయకుండా తాతల కాలం నుంచి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఎంత పని చేసినా కూడా ఇంట్లో డబ్బులు నిలవడం లేదా అయితే స్నానం చేసేటప్పుడు నీటిలో వీటిని వేసి స్నానం చేస్తే కనుక మీ ఇంట్లో ఉండే సంపద అలాగే ఉంటుంది.

అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటారు. అయితే స్నానం చేసే నీటిలో వేటిని వేయడం వల్ల మీ సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వివిధ పనుల వల్ల హడావిడిగా స్నానాలు చేస్తూ బయటికి వెళ్తూ ఉంటారు. అయితే స్నానం చేసే నీటిలో ఏ పదార్థాలు వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కాస్త పాలు కలిపి స్నానం చేయడం వల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది. అంతేకాకుండా శారీరక బలం కూడా పెరుగుతుంది.
2. మీరు కొత్త జాబ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు లేదదా ఏదైనా కొత్త బిజినెస్ చేయడానికి బయటికి వెళ్తున్నప్పుడు మీరు స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకొని చేయండి.ఇలా గనుక చేస్తే కచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.

3. స్నానం చేసే నీళ్లలో చిటికెడు ఉప్పు వేసుకొని చేస్తే గనుక మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
4. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో తమలపాకులు వేసి గనుక స్నానం చేయడం వల్ల సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

5. ప్రతి గురువారం స్నానం చేసే నీళ్లలో దుర్భ లేదా దుర్భా రసం వేసి గనుక స్నానం చేస్తే అదృష్టంతో కూడిన ప్రయోజనాలు కలుగుతాయి.
6. ప్రతిరోజు స్నానం చేసే నీళ్లలో చందనం లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు, రోజు వాటర్ వంటివి ఆ నీళ్లలో వేసి స్నానం చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.