Technology: స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..? జాగ్రత్త ఈ తప్పులు చేస్తే హ్యాక్ అయిపోతుంది..!!

ఈరోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది పైగా గంటలు గంటలు ఫోన్ లోనే నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ తప్పులను చేయకండి.. ఈ తప్పులను కనుక చేశారు అంటే కచ్చితంగా ఫోన్ హ్యాక్ అయిపోతుంది ఫోన్ హ్యాక్ అయిపోతే ముఖ్యమైన సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్తుంది అటువంటప్పుడు మీరు ఇబ్బందుల్లో పడొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఏదైనా నోట్ మీద మీరు ముఖ్యమైన విషయాలని రాసుకోండి కానీ ఫోన్లో ముఖ్యమైన విషయాలని ఉంచకండి చాలా మందికి ఫోన్లో ముఖ్యమైన విషయాలని రాసి దాచుకోవడం అలవాటు. అలా చేస్తే కచ్చితంగా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది అలా కాకుండా మీరు ఒక కాగితం మీద రాసుకోవడం మంచిది. ఇష్టానుసారంగా యాప్స్ డౌన్లోడ్ చేయకండి గూగుల్ ప్లే స్టోర్ లో మాత్రమే డౌన్లోడ్ చేయండి.

థర్డ్ పార్టీ యాప్ సోర్స్ నుండి లేదంటే ఇతర అనాఫిషియల్ సోర్సుల నుండి ఎప్పుడూ కూడా యాప్స్ ని డౌన్లోడ్ చేయకండి. మాల్వేర్ ఉండే ప్రమాదం వుంది. దాంతో మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఫోన్ ని అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది ఫోన్ అప్డేట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

నిజానికి అప్డేట్ చేస్తే ఏమైనా బగ్స్ ఉన్న సెక్యూరిటీ కి సంబంధించిన లోపాలు ఉన్నా కూడా ఫిక్స్ చేయడానికి అవుతుంది కాబట్టి ఈ ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. పబ్లిక్ వైఫై ని వాడకుండా చూసుకోండి ఇలా చేయడం వలన కూడా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది డివైస్ సాఫ్ట్వేర్ మార్చాలనుకునే కొందరు స్మార్ట్ ఫోన్లు రూట్ మారుస్తున్నారు ఇలా కూడా ఫోన్ హ్యాక్ అవచ్చు.