మనకి కలలో ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తామో అవే ఎక్కువగా మనకి కల లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి బాగా ఆలోచనలు పెట్టుకుని అనవసరంగా కృంగిపోకండి. అయితే కలలో కనపడే వాటిని బట్టి మన నిజాయితీ జీవితం ఎలా ఉంటుందని చెప్పొచ్చు. అయితే కల లో ఏం కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కల లో కనుక పాము కనబడితే భవిష్యత్తు లో ఆకస్మాత్తుగా మీకు డబ్బులు వస్తాయని దాని వెనుక సంకేతం.
కల లో పాము కనపడినా పాము పుట్ట నుండి బయటికి వస్తున్నట్లు కనిపించినా కూడా మంచి కలుగుతుంది. సడన్ గా డబ్బులు వచ్చేస్తాయి. కల లో కనుక చెట్లు ఎక్కినట్లు కనపడితే హఠాత్తుగా డబ్బుని మీరు అందుకుంటారు. సడన్ గా మీకు డబ్బులు వచ్చేస్తాయి ధనవంతులు అయిపోతారు. అలానే కల లో డాన్స్ చేస్తున్న స్త్రీ కనుక కనబడితే ఎంతో మంచి జరుగుతుంది.
భవిష్యత్తు లో మీకు ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆనందమైన జీవితాన్ని గడుపుతారని దానికి సంకేతం. కల లో కనుక బంగారం కనబడితే లక్ష్మీ దేవి మీ ఇంటికి రాబోతుందని దానికి సంకేతం త్వరలో బంగారం మీ ఇంటికి వస్తుందని దానికి అర్థం. కల లో తేనెటీగ గూడు చూస్తే కూడా మంచి జరగబోతుందని అర్థం.
తేనెటీగ అనేది సంపదను పొందడానికి సంకేతము. కాబట్టి సడన్ గా డబ్బులు వస్తాయి. మీ కల లో ఉంగరం పెట్టుకున్నట్లు కనపడితే కూడా అదృష్టం వస్తుంది. తెలుపు లేదా ఎరుపు రంగు ముత్యాల ఉంగరాన్ని ధరించినట్లు కనుక మీ కల లో కనపడితే రాబోయే రోజుల్లో మీ జీవితం ఎంతో బాగుంటుందని దానికి సంకేతం. కలలో ఎలుక కనబడితే వినాయకుడి అనుగ్రహం మీకు ఉందని శుభసంకేతంగా భావించాలి. ఎలుకని చూస్తే ఇంట్లోకి డబ్బు కూడా వస్తుంది.