చాలామంది పంటి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టరు కానీ పంటి ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పళ్ళు ఎప్పుడు తెల్లగా అందంగా ఉండాలి. నోటి నుండి దుర్వాసన లేకుండా ఉండాలి. పంటి ఆరోగ్యం దెబ్బతింటే చిగుళ్ల నుండి రక్తం కారడం మొదలు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండాలి అందుకని పంటి ఆరోగ్యం పై అశ్రద్ధ చేయకండి. చాలామంది త్వర త్వరగా పళ్ళు తోముకుని వచ్చేస్తుంటారు కానీ అలా చేయడం మంచిది కాదు. కాస్త సమయాన్ని వెచ్చించి దంతాలని శుభ్రంగా తోముకోవాలి. అయితే ఎక్కువ మందిలో పళ్ళు పచ్చగా మారిపోవడం ఇబ్బందిగా ఉంటుంది.
మీ పళ్ళు కూడా పచ్చగా మారిపోయాయా.. అయితే ఈ టిప్స్ ని మీరు కచ్చితంగా అనుసరించాలి ఇలా చేస్తే పసుపు దంతాలు కూడా తెల్లగా మారిపోతాయి. మరి ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీ దంతాలు పసుపుగా ఉన్నట్లయితే ఇలా చేయండి వెంటనే తెల్లగా మారిపోతాయి. పళ్ళు పసుపుగా మారిపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఇలా ఈజీగా మనం ట్రై చేస్తే సరిపోతుంది. దంతాలను తెల్లగా మార్చుకోవాలంటే ఉప్పుతో పళ్ళని తోమండి ఉప్పుతో పళ్ళని తోమితే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
అరకప్పు నీటిలో చిటికెడు ఇంగువ వేసి మరిగించి ఈ నటిని మీరు రోజు రెండుసార్లు పుక్కిలిస్తే కూడా దంతాలు తెల్లగా మారుతాయి. పసుపు రంగు తొలగిపోతుంది. పళ్ళు గార పట్టినా లేదంటే పసుపు రంగులో మారినా అరటి తొక్క బాగా ఉపయోగపడుతుంది ఈ తొక్కతో మీరు దంతాల మీద రుద్దితే పళ్ళు తెల్లగా వస్తాయి. పైగా నోటి నుండి దుర్వాసన కూడా రాదు.
నిమ్మకాయని కూడా మీరు పళ్ళు పసుపు రంగులో నుండి తెలుపు రంగులోకి మారడానికి ఉపయోగించవచ్చు కొంచెం నీటిలో నిమ్మరసం కలిపి ఈ నీటితో మీరు పుక్కిలిస్తే ఖచ్చితంగా నోటి దుర్వాసన ఉండదు. పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి. బేకింగ్ సోడాతో కూడా మీ పళ్ళు మెరుస్తాయి. వారానికి రెండు మూడు సార్లు బ్రష్ మీద కొంచెం బేకింగ్ సోడా వేసి పళ్ళు తోముకోండి అప్పుడు పళ్ళు తెల్లగా అందంగా ఉంటాయి. స్ట్రాబెరీలని దంతాల మీద రుద్దితే కూడా పళ్ళు తెల్లగా మారుతాయి.