విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాలు ఈరోజు 11 గంటల కు రాబోతున్నాయి. టెన్త్ ఫలితాలు చూడడం కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణం లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఫలితాల ను విడుదల చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం లో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు పేరెంట్స్ ఎదురు చూపుల కు ఈ రోజు తో ఎండ్ కార్డు పడబోతోంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతం లో టెన్త్ ఫలితాలు విడుదల చేయాలని అధికారికం గా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఇప్పటి కే మంగళ వారం రోజున తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ తరుణం లోనే టెన్త్ ఫలితాలు కూడా విడుదల చేయడం కోసం ప్రభుత్వం సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మూడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరిగాయి. ఈ పదవ తరగతి పరీక్షల కు మొత్తం 7,39,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటి కే ఈ పరీక్షల కు సంబంధించిన జవాబు పత్రాల మూల్యంకనం పూర్తయింది.
ఇది లా ఉండ గా గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లో పది ఫలితాల్లో అత్యధికం గా ఉత్తీర్ణత శాతం నమోదయింది. ఏకం గా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరి లో అబ్బాయిల ఉత్తీర్ణత 87.61%, అమ్మాయిల ఉత్తీర్ణత 92.45% గా నమోదయింది. ఇందు లో జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానం లో 97.87% ఉత్తీర్ణత సాధించింది. మరి చూడాలి ఈ ఏడాది ఏ జిల్లా మొదటి స్థానం లో ఉంటుందో, ఏ జిల్లా చివరి స్థానం లో ఉంటుందో రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
http://results.bse.telangana.gov.in