Jobs: ఇంటర్‌/డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..!!

మీరు మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? మీకు గుడ్ న్యూస్. ఒరిస్సా లోని కటక్‌లోనున్న స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ లో జాబ్స్ ఖాళీ వున్నాయి. అర్హత కలిగి వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయ్యవచ్చు. స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ లో 77 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వున్నాయి. పోస్టు ని బట్టీ ఎడ్యుకేషన్ ఉండాలి.

ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. జూన్‌ 7, 2023వ తేదీ లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.800లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద పే చెయ్యాల్సి వుంది. జనరల్ అభ్యర్ధులు రూ.1000. రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలని చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టులు:

లెక్చరర్ ఫిజియోథెరపీ పోస్టులు: 4
క్లినికల్ అసిస్టెంట్ (స్పీచ్ థెరపిస్ట్) పోస్టులు: 3
క్లినికల్ అసిస్టెంట్ (డెవలప్‌మెంటల్ థెరపిస్ట్) పోస్టులు: 3
అకౌంటెంట్ పోస్టులు: 3
స్పెషల్ ఎడ్యుకేటర్స్ / ఒ అండ్‌ ఎం ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 7
ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 3
వర్క్‌షాప్ సూపర్‌వైజర్ పోస్టులు: 4
డైరెక్టర్ పోస్టులు: 4
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పీచ్) పోస్టులు: 3
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీఎంఆర్‌) పోస్టులు: 3
లెక్చరర్ ఆక్యుపేషనల్ థెరపీ పోస్టులు: 3
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 4
రిహాబిలిటేషన్ ఆఫీసర్‌ పోస్టులు: 4
ప్రోస్టెటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్ పోస్టులు: 15
అసిస్టెంట్ పోస్టులు: 4
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్ సైకాలజీ) పోస్టులు: 3
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు: 4
క్లర్క్/ టైపిస్ట్ పోస్టులు: 3