Prabhas : టాలీవుడ్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని చెప్పాలి. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన… బాహుబలి సినిమాతో ఓ రేంజ్ కు వెళ్లిపోయాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండిపోయాడు. ఆది పురుష్, ప్రాజెక్టు కే, సలార్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే గత సంవత్సరం రాధే శ్యామ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ప్రభాస్ అలరించారు.
అయితే ఈ సినిమా ప్రేక్షకులకు సరిగా రీచ్ కాకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయింది. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన పూజా హెగ్డే నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను రాధా కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కించారు. జ్యోతిష్యం కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదని చెప్పాలి. అయితే.. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్ మరియు పూజ హెగ్డేల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అలాగే వారిద్దరు మధ్య మాటలు లేవని గతంలో వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఇక ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో సైతం ప్రభాస్ మరియు పూజ హెగ్డే లు మాట్లాడుకున్నట్లు అస్సలు కనిపించలేదని ప్రచారం సాగుతోంది. పక్క పక్కనే ఉన్నప్పటికీ మూవీ హీరో హీరోయిన్ మధ్య ఉండే బాండింగ్, కెమిస్ట్రీ అయితే.. ప్రభాస్ మరియు పూజ హెగ్డే ల మధ్య మిస్ అయిందని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మరియు పూజ హెగ్డే ఎడమొహం పెడమొహంగా కనిపించారని టాక్ వినిపిస్తోంది.
దీంతో ప్రభాస్ మరియు పూజ హెగ్డే ల మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలకు..వారి తాజా ప్రవర్తన మరింత బలం చేకూరిందట. ఈ తరుణలోనే పూజ అభిమానులు ప్రభాస్ ను భారీగా ట్రోల్ చేశారు. ప్రభాస్ వల్లే పూజ కెరీర్ నాశనం అయిందని పూజ అభిమానులు ఆగ్రహిస్తున్నారు. దాంతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై పూజ హెగ్డే క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ కు తనకు ఎలాంటి సమస్యలు లేవని.. ప్రభాస్ చాలా మంచోడని చెప్పింది. తనకు ఎప్పుడు ఫ్రెండ్ లాగా ప్రభాస్ ఉంటాడని పేర్కొంది. కానీ.. పూజా ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ వల్లే పూజ కెరీర్ నాశనం అయిందని ఆగ్రహిస్తున్నారు.