ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటి దగ్గరే ఉండి ఏదైనా బిజినెస్ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇంట్లో ఉండే మహిళలు కూడా బిజినెస్ చేయాలని కలలు గంటున్నారు.కానీ చాలామంది పెళ్లయిన మహిళలు ఇంటి నుండి కాళ్లు బయట పెట్టడానికి అత్తింటి వారు ఒప్పుకోరు. అందుకే ఇంట్లో ఉండే నెలకు 50 వేల వరకు ఈ బిజినెస్ చేసి సంపాదించవచ్చు.
ఇక ఈ బిజినెస్ ఏంటో కాదు బేబీ కేర్ సెంటర్.. బేబీ కేర్ సెంటర్ అనేది కేవలం మహిళలకు మాత్రమే సాధ్యమయ్యేది. ఎందుకంటే మహిళలకు మాత్రమే ఓపిక,సహనం వంటివి ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే మహిళలు ఈ బేబీ కేర్ సెంటర్ ని పెట్టి మీ ఇంటి దగ్గర ఆఫీసులకు వెళ్లే మహిళలు బిజినెస్ చేసే మహిళలు ఇంకా వేరే ఏదైనా జాబ్ చేసే మహిళలు తమ పిల్లల్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ కొంతమంది జాబ్స్ కూడా మానేస్తూ ఉంటారు.
అలాంటి వారి పిల్లల్ని మీ బేబీ కేర్ సెంటర్ లో చేర్పించుకొని నెలకు 50000 వరకు సంపాదించవచ్చు.అయితే ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేముందు మీ ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఖాళీగా ఉంటే చాలు.ఆ రూమ్లో పిల్లలకి ఆడుకోవలసిన బొమ్మలు ఇంకా చిన్న పిల్లలైతే ఉయ్యాలా వంటివి ఏర్పాటు చేయాలి. జాబ్ చేసే తల్లుల పిల్లల్ని మీ బేబీ కేర్ సెంటర్లో చేర్పించుకొని ప్రతి నెల ఎంతో కొంత డబ్బుని వారి దగ్గర నుండి పొందవచ్చు.
అంతేకాకుండా మరింత పబ్లిసిటీ కోసం పాంప్లెట్స్ వంటివి మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్లకు పంచి వారికి నమ్మకం కుదిరేలా చేసుకోవాలి. అయితే మీ మీద నమ్మకం ఉంటేనే వాళ్ళు మీ బేబీ కేర్ సెంటర్లో చేర్పిస్తారు. అలాగే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటో వారి తల్లిదండ్రుల నుంచి తెలుసుకొని వారికి అదే ఫుడ్ ఇవ్వాలి.ఇక పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటే అంతమంది ఎక్కువ పిల్లలు మీ బేబీ కేర్ సెంటర్లలో చేర్పించడానికి తల్లులు ఇష్టపడతారు. ఇక ఈ బేబీ కేర్ బిజినెస్ వల్ల నెలకు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.