Anushka Shetty: 6వ తరగతిలోనే అలాంటి పని చేసిన అనుష్క..!

Anushka Shetty

Anushka Shetty first love proposal:

Anushka Shetty: అందాల భామ, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన అందం, అభినయం, టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అనుష్క సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ” మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” చిత్రం మాత్రమే ఉంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వీటీ తన మొదటి లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అనుష్కకు ఫస్ట్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందంటే.. 6వ తరగతిలోనేనట. ఆమె స్కూల్ లో చదివే సమయంలో ఓ కుర్రాడు ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడట. కానీ ఆ సమయంలో ప్రేమ అంటే ఏంటో కూడా తనకి తెలియదని.. దాంతో ఆ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయగానే అయోమయంలో ఓకే చెప్పేసాను అని తెలిపింది. ఆ తర్వాత తన లైఫ్ లో అదొక మెమొరీ గా నిలిచిపోయిందని చెప్పుకొచ్చింది.

ఈ విషయం తెలిసిన నేటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్వీటీ 6వ తరగతి లోనే అలాంటి పని చేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ మధ్య ప్రభాస్ కి – అనుష్కకి మధ్య ఏదో ఉందని.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా వినిపించాయి. కానీ తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరు క్లారిటీ ఇచ్చారు.