Kesineni Nani comments on tdp party
Kesineni Nani : గత కొన్ని రోజుల నుంచి తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చాలా గుర్రుగా ఉన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. అయితే.. తాజాగా మరోసారి తెలుగు దేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు నాని. ఎ. కొండూరు మండలంలో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా ట్యాంకర్లు పంపిణీ చేశారు ఎంపీ కేశినేని నాని. ఈ సందర్ఢంగా కిడ్నీ బాధిత ప్రాంతాలకు 17 ట్యాంకర్లు పంపిణీ చేశారు కేశినేని నాని. పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులతో తాగునీటి సమస్యపై దృష్టి పెట్టామని.. టీడీపీలో నాకు ఏ పదవీ లేదు…నేను అధికార ప్రతినిధి ని కాదని తెలిపారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.
నేను అన్ని పార్టీలతో టచ్ లో ఉంటాను…బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడా టచ్ లో ఉంటానంటూ బాంబ్ పేల్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. కొంత మంది ఏం చేసినా మెచ్చుకునే వారు ఉంటారు..గిట్టని వారు ఉంటారని ఆగ్రహించారు. నేను పార్టీల తరపున కార్యక్రమాలు చేయడం లేదని… ప్రజల తరపున చేస్తున్నానని స్పష్టం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. నియోజకవర్గాల ఇంఛార్జీలు గొట్టం గాళ్ళు అని… వాళ్లేమీ కాంస్టిట్యూషన్ కాదు… రాజ్యాంగ పదవులు కాదంటూ చురకలు అంటించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani ).

వైసీపీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు అంటే నేను మాంచివాడిననే కదా అంటూ నిలదీశారు. పొమ్మనలేక పొగబెట్టి…నాకు హీట్ తగిలితే అప్పుడు ఆలొచ్చిస్తానని.. చంద్రబాబు పిలిస్తే వెళ్లి మాట్లాడతాను…నేను వెళ్లి ఏమీ చెప్పనన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. అక్కడితో అగకుండా… మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లపై విరుచుకుపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani ).
నన్ను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టం గాడు, చెప్పుతో కొడతా అన్నారు… అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫోటో మీద వేశామంటూ మండిపడ్డారు. అలాంటి గొట్టం గాళ్ళ గెలుపు కోసం కూడా పని చేస్తున్నానని పేర్కొన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి బెజవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నాని చెప్పుకొచ్చారు.