Pragathi aunty comments on viral
Pragathi: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్న నటీమణుల్లో ప్రగతి ఒకరు. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అక్క, తల్లి, అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వయస్సు పెరుగుతున్నా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రగతి. ఇక సోషల్ మీడియాలో విపరీతంగా ఆక్టివ్ గా ఉండే ప్రగతి ఆంటీకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
సోషల్ మీడియాలో జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ నెటిజెన్లకు షాక్ ఇస్తూ ఉంటుంది ప్రగతి. అయితే ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో తాను పిజ్జా హట్ లో పనిచేశానని పేర్కొంది. అంతేకాదు టెలికాం బూత్, ఎస్టిడి బూత్ లో కూడా పని చేశానని తెలిపింది. ఆ తర్వాత కార్టూన్ డబ్బింగ్ కోసం పనిచేశానని.. ఒక యాడ్ కోసం తనని అడగగా అలా మోడలింగ్ లోకి వచ్చానని తెలిపింది ప్రగతి.
అయితే ఆ సమయంలో తాను అందగత్తెను కాదని.. లడ్డులా ఉండే దానిని వెల్లడించింది. ఏ వృత్తికైనా అర్హత ఉంటుందని.. దానికి ముందుగానే ప్రిపేర్ గా ఉండాలని పేర్కొంది. అయితే హీరోయిన్ గా మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పుకొచ్చింది. ఒక హీరో కం: నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్లే సినిమాలు చేయకూడదని భావించానని కీలక వ్యాఖ్యలు చేసింది ప్రగతి. ఒకరిని నమ్మి మోసపోయామంటే.. మోసం చేసిన వాళ్ళ కంటే మోసపోయిన వాళ్ళదే తప్పు అని చెప్పింది. దీంతో ప్రగతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.