Perni Nani comments on TDP
Perni Nani : తెలుగు దేశం పార్టీపై మాజీ మంత్రి పేర్ని నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారని.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేదని వెల్లడించారు పేర్ని నాని. టీడీపీ అధ్యక్షుడిగా వర్ల రామయ్య ఎందుకు ఉండకూకూడదు..? అని ప్రశ్నించారు. ఉచిత సలహాలు ఇచ్చే విధానాన్ని వర్ల రామయ్య మానుకోవాలని చురకలు అంటించారు. జనంలో క్రెడిబులిటీ సంపాదించేందుకు ఏం చేయాలో చంద్రబాబుకు వర్ల రామయ్య సలహాలివ్వాలని ఎద్దేవా చేశారు పేర్ని నాని.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని… సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేదని… రోడ్డెక్కి ఉద్యమం చేయకుండా గతంలో ఏ ప్రభుత్వమూ పీఆర్సీ కమిటీ నియామకం చేయలేదని ఆగ్రహించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని… కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహించారు మాజీ మంత్రి పేర్ని నాని.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తున్నారని.. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో ఏదీ లేదని తెలిపారు. రాజకీయం కోసం తెలంగాణలో ఎవరో సీఎం చేశారని ఇక్కడ చేయడం లేదని… వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు గతంలో చాలా కష్టాలు పడేవారన్నారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు పెన్షన్ రావాలంటేనే నరకం చూసేవారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 13వేల మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ).
పాదయాత్ర చేస్తోన్న నారా లోకేష్ ప్రజా ప్రతినిధి కూడా కాదని… చంద్రబాబు కుమారుడికి భద్రత కరవైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని వెల్లడించారు మాజీ మంత్రి పేర్ని నాని.
నోటికొచ్చినట్లుగా భద్రతా సిబ్బందిని లోకేష్ మాట్లాడుతున్నారు…. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సినంత దానికంటే ఎక్కువగానే భద్రతను ప్రభుత్వం ఇచ్చింది….టీడీపీ వాళ్లే సెల్ఫీ ఇవ్వలేదని లోకేషును కోడిగుడ్లతో కొట్టారన్నారు. చంద్రబాబు కుమారుడికి బ్లాక్ క్యాట్ కమాండోలు ఇవ్వాలని అంటున్నారా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.