Ponguleti Srinivas will joins in that party
Ponguleti Srinivas : మరో రెండు రోజుల్లోనే ప్రజలకు నచ్చిన పార్టీలో చేరుతానని ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన చేశారు. ఖమ్మం లో ఎస్ ఆర్ కాన్ వెన్షన్ లో ముఖ్య అనుచరులతో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొని..సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కోసం వచ్చిన నా కుటుంబ సభ్యుల అందరికి ధన్యవాదాలు అంటూ ప్రసంగించిన పొంగులేటి… ఉమ్మడి ఖమ్మం జిలా మారుమూల ప్రాంతాల నుండి ఒక్క పిలుపు తో వచ్చారని తెలిపారు.
పార్టీ మార్పు విషయంపై మీ అందరింతో చర్చించే నిర్ణయం తీసుకుంటా అని గతంలోనే చెప్పానని… కురుక్షేత్ర యుద్దం ప్రకటించి 5 నెలల 10 రోజులు అవుతుందని గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకులు మనల్ని ఏగతాళి చేశారు పార్టీ జెండా లేదు ఆజేండా లేదని చవాకులు పేలారని ఆగ్రహించారు. మీరు ఎన్ని చేసిన మీ అధికార పార్టీ ట్రాప్ లో శ్రీనన్న కానీ శ్రీనన్న అభిమానులు కానీ పడారని గుర్తు చేశారు పొంగులేటి ( Ponguleti Srinivas ).
గత కొద్ది రోజులుగా వేరే పార్టీ లో జాయిన్ అవుతున్న అని మీడియాలో రావటాంతో కొందరు అధికార పార్టీ నాయకులు మందు విందు చేసుకొని పండగా చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ మందు లేకుండానే కిక్కు ఎక్కీ తలలు పట్టుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు…. రాబోయే కురుక్షేత్రం చిరునవ్వుతూనే రాజకీయ సమాది చేయ్యాటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు పొంగులేటి.
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామ రావు జయంతి ఉత్సవాలు జరుపుకునే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు పొంగులేటి.. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తే మీరు శుద్ది చేస్తారా..రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ది చెబుతారని మండిపడ్డారు ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. రెండు మూడు రోజుల్లో హైదరాబాదు ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు వెల్లడిస్తానని.. చెప్పిన పొంగులేటి.. లక్షల మంది అభిమానుల మధ్య నే ఖమ్మం నడి బోడ్డునే పార్టీ లో జాయిన్ అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుందుకు సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది.