A tollywood hero missed harnuman role in Adipurush
Adipurush : మన టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్, లవ్ యాంగిల్, ఎమోషనల్, సస్పెన్స్, హారర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు మన తెలుగు లో వస్తున్నాయి. ఇక ఈ రకరకాల సినిమాలలో… కొన్ని మాత్రమే హిట్ అవుతుంటే… మరి కొన్ని అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అద్భుతమైన ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ ప్రాజెక్టు మరేదో కాదు అది ఆదిపురుష్ ( Adipurush ) సినిమా.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో… ఎవరు ఊహించిన రీతిలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ దర్శకుడు… ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా… పలువురు బాలీవుడ్ స్టార్లు ఈ సినిమాకు పనిచేశారు. రాములోరి గెటప్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా , సీతమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఆకట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రావణాసుడు గెటప్ లో సైఫ్ అలీ ఖాన్ విజృంభించి నటించారని తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో… ఆది పురుష్ ( Adipurush ) సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో హనుమంతుని పాత్ర చాలా కీలకమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే హనుమంతుడి పాత్రలో మెరిశాడు. అతని పర్సనాలిటీ చాలా బలిష్టంగా ఉండడంతో హనుమాన్ పాత్ర అంటగట్టారు దర్శకుడు ఓం రౌత్.
అయితే ఈ హనుమంతునీ పాత్రను మొదటగా టాలీవుడ్ హీరో ను అనుకున్నారట చిత్ర బృందం సభ్యులు. టాలీవుడ్ హీరో ఎవరో కాదు… మన దగ్గుబాటి రానా. మొదట హనుమంతుడి పాత్రను చేయాలని రానాను కోరిందట చిత్ర బృందం. అయితే తనకు షెడ్యూల్ లేదని… ఇతర కారణాలు చెప్పి, హనుమంతుడు పాత్రను సింపుల్గా రిజెక్ట్ చేశాడట రానా. ఈ క్రమంలో హనుమంతుడి పాత్ర దేవదత్త నాగేను వరించిందని సమాచారం.