Balakrishna (NBK 109) New Movie Pooja Ceremony
నందమూరి బాలకృష్ణ వరుస భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి మరో బ్లాక్‌బస్టర్ యాక్షన్ బ్లాక్‌బస్టర్‌ను ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తోంది.
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి సినిమా పనులను ప్రారంభించారు. స్క్రీన్ ప్లే ను మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ చిత్ర బృందానికి అందజేశారు. దక్షిణ కొరియా గౌరవ అటార్నీ జనరల్ చుక్కపల్లి సురేష్ ఈ ముహూర్తపు షాట్ కు క్లాప్ అందించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
కాగా చిత్ర కథాంశంతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. వైన్ సీసాలు, గొడ్డళ్లు మరియు ఇతర పదునైన ఆయుధాలు వంటివి కథానాయకుడు ఎంత శక్తివంతంగా ఉన్నాడో తెలియజేస్తున్నాయి. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది చిత్ర బృందం. “వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్” అనే క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. దానికితోడు సినిమా పోస్టర్‌పై రాసిన “ప్రపంచం మొత్తానికి ఆయన తెలుసు.. కానీ ఆయన ప్రపంచం ఎవరికీ తెలియదు” అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
ఈ రెండు లైన్స్ తో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి . థియేటర్ అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు ఈ చిత్రం విభిన్నమైన సినిమా చూసే అనుభూతిని కలిగిస్తుందని సినిమా కార్యక్రమానికి విచ్చేసిన వారు తెలిపారు. ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీలైనంత త్వరలో చిత్ర బృందం ప్రకటిస్తుంది.(NBK 109)