CM JAGAN HELPS TO PUNCH PRASAD
CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తనలో ఉన్నటువంటి మంచి మనసును టాలీవుడ్ నటుడి పై చాటుకున్నారు. ఇప్పటికే చాలామందికి ముఖ్యంగా అనారోగ్య సమస్యల పాలైన వారికి అనేకసార్లు ఆర్థిక సహాయం అందించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది కమెడియన్స్, యాక్టర్ లు ఉన్న సంగతి తెలిసిందే.
కానీ అందులో కొంతమంది మాత్రమే చాలా క్లిక్ అయితారు. అలా చాలా పాపులర్ అయ్యాడు జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్. జబర్దస్త్ షోలో.. టైమింగ్ చూసి పంచులు వేస్తాడు పంచ్ ప్రసాద్. ఈ నేపథ్యంలోనే అతనికి పంచ్ ప్రసాద్ అని బిరుదు ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్.. తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రసాద్ ను గత కొంతకాలంగా కిడ్నీ సమస్య బాధిస్తోంది. దీంతో జబర్దస్త్కు దూరమయ్యాడు ప్రసాద్.
ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్… చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అతడు బతకడం కూడా కష్టమని మొన్నటి వరకు ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… ప్రసాద్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రసాద్ అనారోగ్యంపై జబర్దస్త్ నటుడు ఇమాన్యుల్ గత వారం రోజుల కింద పోస్టు పెట్టాడు. ప్రసాద్ అనారోగ్యంగా ఉన్నాడని… అతనికి ఎవరైనా ఆర్థిక సహాయం ఇవ్వండి అని కోరాడు.
అయితే ఈ మెసేజ్ కాస్త ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు కూడా చేరింది. దీనిపై చొరవ చూపిన మంత్రి రోజా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) గారికి కూడా వివరించింది. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద… జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.