Honey Rose item song in balayya movie
Honey Rose : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్య కు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. నందమూరి బాలయ్య ఏది చేసినా హైలెట్ అవుతుంది. అయితే ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో నందమూరి బాలయ్య మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలయ్య. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా కొనసాగుతోంది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు భగవంతు కేసరి అనే డిఫరెంట్ టైటిల్ ను రెండు రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కాజల్ మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా…. హీరోయిన్ శ్రీ లీల మాత్రం బాలయ్య కూతురుగా నటిస్తూ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఇక బాలయ్య బర్త్డే నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో వీర సింహారెడ్డి బ్యూటీ హనీ రోజ్… కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించడమే కాకుండా ఐటెం సాంగ్ లో చిందులు వేయనుందట హనీ రోజ్.
అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే తమన్నా, ఊర్వశి రౌతెలా ను అనుకుంది చిత్రం బృందం. కానీ వీర సింహారెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో… హనీ రోజ్ ( Honey Rose ) ను ఫైనల్ చేసిందట. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం అందుతోంది.