Varun Tej Lavanya Tripathi Engagement
Varunlavs : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటీనటులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ చిత్రపరచడంలో పెళ్లిళ్ల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, హీరో శర్వానంద్ ఇద్దరు ఇటీవల కాలంలోనే వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా… పెళ్లి పీటలు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
తన ప్రియురాలు అయిన లావణ్య త్రిపాఠిని మనువాడేందుకు వరుణ్ తేజ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నిన్న అంటే శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, వివిధ సెలబ్రిటీలు రాకపోయినప్పటికీ… ఈ వేడుకను మాత్రం నాగబాబు చాలా గ్రాండ్ గా చేశారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ను చాలా గోప్యంగా ఉంచిన నాగబాబు… తన రిసార్ట్ లోనే వీరి ఎంగేజ్మెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేసేసారు.
ఈ తరుణంలోనే నిన్న ఎనిమిది గంటల సమయంలో… వరుణ్ తేజ్ ( Varunlavs ) మరియు లావణ్య త్రిపాఠీ ( lavanya tripati )లు ఒకరినొకరు రింగ్స్ మార్చుకున్నారు. ఇక ఈ వేడుకకు మెగా కుటుంబం మరియు అల్లు వారి కుటుంబం నుంచి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు తన ఎంగేజ్మెంట్ పై సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టు కూడా చేశాడు వరుణ్ తేజ్.
తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి… నా ప్రేమ నాకు దక్కింది అంటూ రాసుకొచ్చాడు వరుణ్ తేజ్. కాగా 2016 నుంచి… వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని… చెప్పకనే చెప్పాడు వరుణ్ తేజ్. తన జీవితానికి శాశ్వత ప్రేమను కనుగొన్నానని వివరించాడు. కాగా మిస్టర్ మూవీ షూటింగ్ టైమ్ లో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం అందుతుంది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోని ఈ జంట కలిసి నటించింది.