Nagababu conditions for Varun Tej – Lavanya Tripathi marriage
Varun – Lavanya engagement: ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఏడడుగులు వేయబోతోంది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జూన్ 9వ తేదీ రాత్రి నాగబాబు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థానికి మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
2017లో మిస్టర్ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ తరువాత అంతరిక్షం చిత్రంలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి.. ఆ తరువాత కొంత కాలానికి వీరి ప్రేమ గురించి ఇంట్లో పెద్దలకు చెప్పారు. దీంతో ఈ విషయంలో నాగబాబు చాలా విషయాలను ఆలోచించి లావణ్య త్రిపాఠికి కొన్ని కండిషన్లు పెట్టాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లయిన తర్వాత తన కుటుంబంలో ఎలాంటి వివాదాలు రావద్దని, నెగిటివిటీ క్రియేట్ కావద్దని ఉద్దేశంతో నాగబాబు వీరి పెళ్లికి కొన్ని కండిషన్స్ పెట్టారట. అంతేకాదు పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్స్ కూడా పెట్టారట. ఈ కండిషన్స్ అన్నింటికి లావణ్య ఒప్పుకున్న తర్వాతే ఎంగేజ్మెంట్ జరిగిందట. ఈ విషయం తెలిసిన నేటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత లావణ్య హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తుందా..? లేదా..? అన్నది సస్పెన్స్ గా మారింది.