Anasuya put a stop to the controversy with Vijay Devarakonda
Anasuya – Vijay Devarakonda: యాంకర్ అనసూయ భరద్వాజ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య వివాదం గురించి మనందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో స్టేట్స్ మీద ” ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ *” అనే డైలాగ్ చెప్పడంపై అనసూయ బహిరంగంగానే అప్పట్లో విమర్శలు చేసింది. దీనిపై విజయ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పటినుండి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.
ఆ మధ్య విజయ్ దేవరకొండ నిర్మించిన “మీకు మాత్రమే చెప్తా” అనే మూవీలో అనసూయ నటించడంతో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ లైగర్, ఇటీవల ఖుషి వరకు ఈ కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది అనసూయ. తాజాగా విమానం సినిమా సక్సెస్ మీట్ లో ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జి స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై.. కిరణ్ కొర్రపాటి, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం విమానం. ఈ చిత్రంలో సముద్రఖని, మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి థియేటర్ లో మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్ లో అనసూయ మాట్లాడుతూ.. ” విజయ్ వివాదం పై నేను ఉన్నది ఉన్నట్టు చెబితే మీరు రాస్తారని అనుకుంటాను. కానీ నేను మాట్లాడిన దాని గురించి మీరు పరమార్ధాలు తీస్తూ రాస్తున్నారు. ఇక విజయ్ గురించి నేను మాట్లాడను అని సోషల్ మీడియాలో చెప్పాను. నా మనశ్శాంతి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఓ మహిళగా, పైగా పిల్లలకు తల్లిని అయినా నాపై ఇలాంటి ప్రచారం చేశారనే విషయం చాలా బాధ కలిగించింది.
సోషల్ మీడియాలో చేసే దాడిని తట్టుకోవడం కష్టం. అది కూడా డబ్బులు ఇచ్చి చేయించారనే విషయం తెలిసి చాలా బాధపడ్డాను. నాకు పిఆర్ టీం లేదు. ఏదైనా నేనే మాట్లాడతాను. ట్వీట్లు కూడా నేనే చేస్తాను. ఇకనుండి ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టడానికి విజయ్ దేవరకొండకు ఫోన్ చేయాలని ప్రయత్నించినప్పటికీ కుదరలేదని చెప్పుకొచ్చింది.