Perni Nani : చంద్రబాబులాగే…కేసీఆర్ కు హరీష్ రావు వెన్నుపోటు ?

perninani
perninani

Perni Nani counter to harish rao

Perni Nani : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుపై ఏపీ మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని సెటైర్లు వేశారు. ఇవాళ మీడియాతో ఏపీ మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని మాట్లాడుతూ…. హరీష్ రావుకు మేనమామ మీద, బావ మీద కోపం, ఈర్ష్య ఉందని… హరీష్ రావు బాధపడలేకే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టి పన్మిషెంట్ వేశారని ఎద్దేవా చేశారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ కెబినెట్లో ఎందుకు లేరు..? హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవుతున్నారంటూ చురకలు అంటించారు.

హరీష్.రావు సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు..? హరీష్ రాలు సర్టిఫికెట్లు కాటాకేస్తే.. ఉల్లిపాయలు కూడా రావంటూ ఎద్దేవా చేశారు ఏపీ మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని. మమ్మల్ని విమర్శిస్తే.. మేం తిరిగి కేసీఆరును విమర్శిస్తామని హరీష్ రావు ఆలోచన అన్నారు. మేం కేసీఆరును విమర్శిస్తే హరీష్ రావు సంతోషించాలని అనుకుంటున్నారని.. మళ్లీ హరీష్ రావు మమ్మల్ని విమర్శిస్తే ఆ ఉబలాటం తీర్చేస్తామని హెచ్చరించారు ఏపీ మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని.

తెలంగాణ కేసీఆర్ అల్లుడు గిల్లుడు చూస్తూ ఊరుకుంటే.. మేం కేసీఆరుని విమర్శిస్తామన్నా వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని ( Perni Nani ). బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చిందని…నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుందని మండిపడ్డారు. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారని… మనువు బీజేపీతో మనస్సు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేష్, సత్య కుమార్, సుజనా వంటి వారి మాటలను నడ్డా చెవికెక్కించుకుంటే నడ్డా ఖర్మ అంటూ ఓ రేంజ్‌ లో ఆడుకున్నారు పేర్ని నాని.

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కోసం విశాఖ ఉక్కు పీక కోయడంలో ల్యాండ్ స్కాం ఉంటుందని… విశాఖ ఉక్కు పీక కొద్దామనే ఆలోచన వెనుక విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేట్ వారికి ఇచ్చేస్తారేమోననే అనుమానం ఉందని ఆగ్రహించారు. అదానీకి, వేదాంతకు క్యాప్టివ్ మైన్లు కట్టబెట్టిన కేంద్రం.. విశాఖ ఉక్కుకు ఎందుకు క్యాప్టీవ్ మైన్ ఎందుకివ్వడం లేదు..? అని నిలదీశారు ఏపీ మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని.