Samantha: సెర్బియా క్లబ్‌లో సమంత డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Samantha

Samantha dances in Serbian club

Samantha: ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది లేడీ సూపర్ స్టార్ సమంత రుత్ ప్రభు. ఫ్యామిలీ మెన్ లాంటి వెబ్ సిరీస్ తర్వాత సమంత క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది సమంత. ఇందులో సమంతకి జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ సెర్బియా దేశంలోని బిల్ గ్రేడ్ లో జరిగింది.

అయితే ఈ సిరీస్ షూటింగ్ విరమంలో మూవీ యూనిట్ ఓ క్లబ్ కి వెళ్ళి అక్కడ సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆ పబ్ లో పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ “ఊ అంటావా” పాటకి చిందులేసింది సమంత. పక్కనే ఉన్న వరుణ్ ధావన్.. సమంతని డాన్స్ చేయమని ఎంకరేజ్ చేయడంతో సమంత వెంటనే ఫుల్ జోష్ లో చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని ఆ పాటకు డ్యాన్స్ వేసింది. దీంతో వరుణ్ ధావన్ కూడా డాన్స్ చేశాడు. దీంతో పక్కన ఉన్న వారంతా ఉత్సాహంతో సమంత పాటకు డాన్స్ చేసి సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సెర్బియా షూటింగ్ షెడ్యూల్ ను సిటాడెల్ టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఫ్రీక్వెల్ గా ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో ప్రియాంకకు తల్లిదండ్రులుగా సమంత – వరుణ్ ధావన్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ – సమంత కాంబోలో రానున్న ఖుషి సినిమా ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.