Cm Jagan Mohan reddy comments on chandrababu
Cm Jagan Mohan reddy : అధికారం కోసం…బంగారం, బెంజ్ కారు ఇస్తానని చెబుతాడని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు. ఇవాళ పల్నాడు జిల్లాలో విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు…అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండని… ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబుదని ఆగ్రహించారు.
మహిళలకు, రైతులకు,యువతకు, ఎస్సీ బీసీ వర్గాలకు ఎన్నికలకు ముందు చంద్రబాబు వాగ్దానం చేశాడని..ఎన్నికల తర్వాత మోసం చేశాడని ఆగ్రహించారు. చంద్రబాబు జీవితమే ఓ మోసం, పచ్చి అబద్దమని నిప్పులు చెరిగారు. పద్నాలుగు ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం జగన్ ( Cm Jagan Mohan reddy ). చంద్రబాబు పేరు చెబితే, వెన్ను పోటు,మోసం,కుట్ర,దగా గుర్తుకు వస్తాయంటూ చురకలు అంటించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.

టిడిపి పార్టీ మూసేయడానికి సిద్ధంగా ఉన్న దుకాణం అంటూ ఎద్దేవా చేశారు. ఆ దుకాణం లో అమ్మడానికి పక్క రాష్ట్రాల బిస్మిల్లా బాత్, కిచిడి లు అమ్మడానికి సిద్ధమయ్యాడంటూ ఆగ్రహించారు. రాయలసీమ డిక్లరేషన్ అని చెప్తున్న చంద్రబాబు పద్నాలుగు ఏళ్లు ఏం గాడిదలు కాసాడని మండిపడ్డారు. ఇప్పుడు పేదలు,బీసీ లు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ( Cm Jagan Mohan reddy ).
పద్నాలుగేళ్ల అధికార కాలం లో ఏం గాడిదలు కాశాడని నిలదీశారు. తాను అధికారం లోకి వస్తె బంగారం,బెంజి కారు ఇస్తానని చంద్రబాబు మోసపు మాటలు చెప్తున్నాడు…చంద్రబాబు బ్రతుకంతా వాగ్దానాలు, వెన్నుపొట్లే అంటూ ఎద్దేవా చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామమని… ఆ సంగ్రామం లో నాకు దుష్ట చతుష్టయం అండ అవసరం లేదు, బీజేపీ అండ అవసరం లేదని చెప్పారు. పేద ప్రజల అండ ఉంటే చాలు వెల్లడించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.