Are womens participating in first time first night
Womens: ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అనేది ఒక అద్భుతమైన కలయిక. దీన్ని పాశ్చత్య దేశాలు చాలా ఈజీగా తీసుకుంటాయి. కానీ మన దేశంలో కాస్త చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటారు. అలాంటి ఈ పనిలో మొదటిసారి పాల్గొన్న సమయంలో మగవారికి మరియు ఆడవారికి అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవారికి ఈ పనిపై అనేక అనుమానాలు తలెత్తుతాయట. ఎవరిని అడగాలి ఎలా తెలుసుకోవాలి అని చాలా సతమతమవుతారట.
అయితే ఈ విషయాలు మహిళలు బయట చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి మహిళల కోసమే ఈ ముఖ్యమైన పాయింట్స్ తీసుకురావడం జరిగింది.. మొదటిసారి శృంగారంలో పాల్గొనే మహిళలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.. ముఖ్యంగా శృంగారంలో పాల్గొనడానికి మానసికంగా శారీరకంగా కూడా బలంగా ఉండాలి. మొదటిసారి చేసినప్పుడు బలవంతంగా చేస్తే దీర్ఘ కాలికా మరియు శారీరక సమస్యలు వస్తాయి. కాబట్టి ఇష్టపూర్వకంగానే లైంగిక రిలేషన్ లో పాల్గొనాలట..
సురక్షిత శృంగారం:
అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సురక్షిత శృంగారం చేయడం మంచిది. ముఖ్యంగా అన్ నౌన్ వ్యక్తులతో శృంగార భావనలో ఉన్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరి పాటించాలి. గర్భనిరోధకాలు వాడటం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధులు నివారించవచ్చు.
తృప్తిగా ఉండాలి:
ముఖ్యంగా మొదటిసారి శృంగారంలో పాల్గొనే స్త్రీ పురుషులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. దీనివల్ల మీరు తృప్తిగా శృంగారంలో పాల్గొనలేరు. కాబట్టి తప్పనిసరిగా తృప్తిగా ఆ పని చేయడం ఇద్దరికీ మంచిదట.
పరిశుభ్రత:
ముఖ్యంగా లైంగిక చర్యకు ముందు మూత్ర విసర్జన చేయడం, అలాగే జననేంద్రియ ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుందట.
రక్తస్రావం :
ఫస్ట్ టైం మగవారితో కలిసినప్పుడు స్త్రీలకు రక్తస్రావం అవుతుందనేది అపోహ. హైమన్ అని పిలిచే చిన్నపొర, సంభోగానికి ముందు చిరిగిపోవచ్చు. దీనివల్ల మొదటిసారి రక్తస్రావం జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు.