Childrens: మీ బిడ్డకు తెలివి పెంచే అలవాట్లు ఏంటో తెలుసా..?

Childrens

Childrens Intelligence habbits

Childrens: చాలామంది వారి పిల్లలు మేధావులుగా ఎదగాలని కోరుకుంటుంటారు.. భవిష్యత్తులో వారిని మంచి పిల్లలుగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు తప్ప ఆచరణలో పాటించరు. మరి మీ పిల్లలు మంచి అలవాట్లతో మంచి బుద్ధిమంతులుగా ఎదగాలంటే ఎలాంటి అలవాట్లు వారికి నేర్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్ర లేవటం:
ముఖ్యంగా ఉదయం పూట నిద్రలేవటం చాలా మంచి అలవాటు. వ్యాయామం, ధ్యానం చేసే దానికంటే ఉదయం పూట నిద్రలేచేవారు చాలా ప్రతిభావంతులుగా ఉంటారు.
సంగీతం: ముఖ్యంగా పిల్లలకు వాయిద్యాలు సంగీతం నేర్పడం వల్ల వారు చాలా యాక్టివ్ గా ఆలోచనపరులుగా మారుతారు.
చర్చలు:
ముఖ్యంగా చాలామంది పిల్లలు పదిమందిలో మాట్లాడాలంటే భయపడతారు. వారిని చిన్నతనం నుంచే సమాజంలో మాట్లాడే అలవాటు చేయాలి. వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా చూడాలి. దీనివల్ల వారికి కమ్యూనికేషన్,నైపుణ్యం పెరుగుతుంది.
ధ్యానం:
ధ్యానం అనేది మనశ్శాంతిని ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజు జ్ఞానం చేసేలా చూసుకోవాలి.
పుస్తక పఠనం:
ప్రస్తుతం సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి పుస్తకాలు పట్టడం మానేశారు. కానీ పుస్తకాలు చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి పుస్తక పఠనం అనేది తప్పనిసరిగా అలవాటు చేయాలి.
శారీరక శ్రమ :
ముఖ్యంగా పిల్లలకు శారీరక వ్యాయామం కూడా చాలా అవసరం. కాబట్టి వారిని క్రీడల వైపు మళ్ళించండి. దీనివల్ల శారీరక శ్రమ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.