Beauty Tips: పసుపులో దీన్ని వేసి మొహానికి పెట్టుకుంటే తెల్లని మొహం మీ సొంతం..!!

Beauty Tips

If you add this turmeric and apply it on your face

Beauty Tips: పసుపులో ఎన్నో రకాల ఔషద గుణాలు ఉంటాయి.దీన్ని యాంటీబయోటిక్ గా ఉపయోగిస్తారు. అంతేకాకుండా దెబ్బ తగిలిన చోట పసుపు పెడితే తొందరగా ఆ గాయం మానుతుంది అని ప్రతి ఒక్కరు నమ్ముతుంటారు. పసుపుని చాలా రకాల బ్యూటీ ఇంగ్రిడియంట్స్ లో కూడా వాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా పసుపు సహజమైన రసాయనాలు లేని క్రీమ్ గా మనకు ఉపయోగపడుతుంది.

పసుపుని కూరల్లో వేసుకోవడమే కాకుండా మన మొహానికి పెట్టుకోవడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామంది తెల్లని మెరిసే మొహం మచ్చలు, మొటిమలు లేని కాంతివంతమైన మొహం కావాలని చూస్తూ ఉంటారు. ఇక మొహం తెల్లగా మారడం కోసం ఎన్నో రకాల క్రీములు పెడుతూ ఉంటారు. కానీ రసాయనాలు గల క్రీమ్ పెట్టకుండా పసుపులో ఈ రెండు వేసి గనుక మొహానికి పెట్టుకుంటే తెల్లని చర్మం మీ సొంతం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే చిటికెడు పసుపులో స్పూన్ నిమ్మరసం, కాస్త పెరుగు వేసి బాగా కలిపి దాన్ని మీ మొహం పై పెట్టుకుంటే మొహం మీద ఉండే మచ్చలు,మొటిమలు తగ్గిపోయి మీ మొహం కాంతివంతంగా చాలా అందంగా తెల్లగా మారుతుంది. ఇక ఈ టిప్ ని వారానికి రెండు మూడు సార్లు పాటించడం వల్ల నాలుగు వారాల్లోనే మీ మొహం తెల్లగా మారుతుంది.

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మీ మొహంపై బ్లీచ్ లా పనిచేసి మొహం మీద ఉండే మచ్చలు అన్ని తొలగిపోయేలా చేస్తుంది. అలాగే పసుపు లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొహం మీద ఉండే మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్నవారికి పెరుగు పెట్టుకోవడం వల్ల మొహం మీద ఉండే నల్ల దనం మొత్తం తొలగిపోయి మొహం కాంతివంతంగా మారుతుంది.