Lakshmidevi : లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి..!!

Lakshmidevi

Do not this 5 mistakes at all to stay in lakshmidevi in your home

Lakshmidevi: చాలామంది ఎన్నో పనులు చేస్తూ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కష్టపడి పని చేయడం వల్లనే కాకుండా మనకు కాస్త అదృష్టం ఉండడం వల్ల కూడా డబ్బు అనేది వస్తుంది. అయితే అలా అదృష్టం వలన లేక కష్టపడి సంపాదించుకున్న డబ్బు మన ఇంట్లో నిలవాలి అంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదట.మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. మరీ ముఖ్యంగా చెత్తాచెదారం కలిగిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు.అలాగే అపరిశుభ్రమైన బట్టలు ధరించి, మురికిగా ఉండే బట్టలు వేసుకునే వారి ఇంట్లో లక్ష్మీదేవి (Lakshmidevi) అస్సలు నిలవదు.

అలాగే ఎవరైతే ఇంట్లో ప్రతిరోజు గొడవలు పెట్టుకుంటూ దుర్భాషలాడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి అస్సలు ఇష్టపడదట.అంతేకాకుండా ఎవరైతే పొద్దెకేవరకు నిద్రపోతూ నిద్ర పిచ్చి వాళ్ళు ఉంటారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు.

మరీ ముఖ్యంగా నిద్ర విషయంలో బద్ధకస్తులుగా అస్సలు ఉండకూడదట. ఇక ఏ ఇంట్లో అయితే దీపం వెలిగించరో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి అస్సలు ఇష్టపడదు . ప్రతి శుక్రవారం ఇంట్లో ఆ లక్ష్మీదేవికి దీపం పెట్టి ఎలాంటి కల్మషం లేకుండా పూజిస్తే లక్ష్మీదేవి (Lakshmidevi) కచ్చితంగా ఆ ఇంట్లో ఉంటుంది.