If this mirror is placed in that direction in house
Vasthu Tips: మన భారత దేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం,స్వప్న శాస్త్రం, జాతకాలు వంటి వాటితో పాటు వాస్తు శాస్త్రాలను కూడా నమ్ముతుంటారు. మరి ముఖ్యంగా ఇల్లు కట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన వాస్తు గురించి అన్ని విషయాలు తెలుసుకునే ఇల్లు నిర్మిస్తారు.ఇక వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పినట్లే ఇల్లు నిర్మిస్తారు. అందులో ఏ చిన్న తప్పు జరిగిన కూడా మళ్లీ ఆ పొరపాటును సరి చేసుకుంటారు.
కేవలం ఇల్లు కట్టడమే కాకుండా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని వాస్తు (Vasthu Tips) ప్రకారం పెట్టుకుంటారు. అందులో ఒకటే గోడకు పెట్టే అద్దం. అద్దాన్ని చాలామంది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అయితే అద్దాన్ని గోడకు ఏ దిశ లో పడితే ఆ దిశలో పెట్టకూడదు అని చాలామంది వాస్తు నిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా గోడకు వాస్తు ప్రకారం అద్దాన్ని పెట్టుకోకపోతే చాలా రకాల పరిణామాలు చూడాల్సి వస్తుంది అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి అద్దాన్ని ఇంట్లో మన గోడకి ఏ దిక్కున పెట్టుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో అద్దాన్ని ఎప్పుడూ కూడా పశ్చిమా లేదా దక్షిణ దిశలో అస్సలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు జరగడమే కాకుండా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. అంతేకాకుండా పగిలిన అద్దాలను ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలాగే వాస్తు శాస్త్రం (Vasthu Tips) ప్రకారం స్టోర్ రూమ్ లో అద్దం పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఇంట్లో అనేక రకాల గొడవలు జరుగుతాయట.
అందుకే ఎప్పుడూ కూడా స్టోర్ రూమ్ లో అద్దాన్ని పెట్టుకోకూడదు. అంతేకాకుండా బెడ్ రూమ్ లో అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఉంచడం చాలా అరిష్టం. అద్దంలో మంచం ప్రతిబింబం కనిపించడం మంచిది కాదట. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దాన్ని ఉంచితే ఇంట్లోకి ధనలక్ష్మి రాకుండానే బయటికి వెళ్లిపోతుందట. అద్దం పెట్టుకోవడానికి అనువైన దిశ కేవలం ఉత్తర లేదా తూర్పు దిక్కు మాత్రమే. ఈ రెండు దిక్కుల్లోనే అద్దాన్ని మన గోడకి పెట్టుకోవాలి.