With this tip pimples and scares will disapper in week
Beauty Tips: చాలామంది అమ్మాయిలు తమ మొహం కాంతివంతంగా, అందంగా మెరిసిపోవాలి అని భావిస్తూ ఉంటారు.ఇక అందం విషయంలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా రకరకాల క్రీములు ఉపయోగిస్తూ తమకు అందమైన మొహం కావాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా అమ్మాయిలు ఈ విషయంలో ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకోవచ్చు.
అందంగా మెరవడం కోసం ఎన్నో రకాల రసాయనాలు కలిగిన క్రీమ్ లను వాడడం ఇప్పటికే మనం చాలామంది విషయాల్లో గమనించి ఉంటాం. కానీ రసాయనాలు కలిగిన క్రీమ్స్ ఏమీ వాడకుండా ఇంట్లో సహజ సిద్ధంగా ఈ చిట్కాను గనుక పాటిస్తే ఖచ్చితంగా వారం రోజుల్లో మీ మొహం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయట.
మరి వారం రోజుల్లోనే మొటిమలు పోయే ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రసాయనాలు గల క్రీములు వాడే కంటే సహజసిద్ధమైన ప్రొడక్ట్స్ ని ఉపయోగించి మొహాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇక అందుకోసం ముఖ్యంగా రెండు స్పూన్ల ముల్తాని మట్టిలో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేసుకొని అందులో కాస్త రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి.
ఒకవేళ ఈ మిశ్రమం బాగా కలవకపోతే కాస్త నీళ్లు పోసుకుని కలిపి మొహాన్ని శుభ్రంగా కడుక్కొని మొహంపై ఈ మిశ్రమం మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మొహంపై పెట్టుకున్న మిశ్రమం ఆరాక పది నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక ఈ చిట్కా పాటించడం వల్ల చర్మంపై ఉండే మురికి పోతుంది.అలాగే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఈ చిట్కా పాటించడం వల్ల వారం రోజుల్లోనే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.