If you apply this with tomato on the face the spots will disappear in 4 weeks
Beauty Tips: చాలామంది తమ మొహం అందంగా ఆకర్షణీయంగా చూడగానే అందర్నీ అట్రాక్ట్ చేసేలా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఆడవాళ్లు మగవాళ్ళు ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటారు.అయితే ఆడవాళ్ళకి అందం గురించి మరి ఎక్కువగా పట్టింపు ఉంటుంది. చాలామంది ఆడవాళ్లు బయట తిరగడం వల్ల దుమ్ము,ధూళి, కాలుష్యం వల్ల వారి మొహం పొడి బారిపోయి మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతూ ఉంటాయి.
మరీ ముఖ్యంగా తినే తిండి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కువగా మొటిమలు,మచ్చలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ మొటిమలు,మచ్చలు తగ్గడానికి చాలామంది రకరకాల రసాయనాలు గల క్రీములు వాడుతూ ఉంటారు.ఈ క్రీములు వాడడం వల్ల మొహం మొత్తం పొడి బరి పోయి ముసలి మొహం వస్తుంది అని చాలామంది చెబుతూ ఉంటారు.అయితే ఇవేవీ చేయకుండా కేవలం ఒక సింపుల్ చిట్కాతో మొహం పై ఉండే నల్ల మచ్చలని నెల రోజుల్లో తగ్గించుకోవచ్చు.
ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్రని టమాటాను తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి ఒక టమాట ముక్క మధ్యలో కాస్త చెక్కర వేసి దాన్ని మీ మొహం మొత్తం రాసుకోవాలి. రెండు నిమిషాల పాటు టమాటా ని అలాగే మొహం మీద రాసుకొని అరగంట తర్వాత చల్లని నీళ్లతో మొహం మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నెల రోజుల్లో మొహం మీద ఉండే నల్ల మచ్చలు తగ్గు ముఖం పడతాయి. టమాటా లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి,ఇ వంటి గుణాలు మన చర్మంపై ఉండే జిడ్డు నల్లదనాన్ని పోగొట్టి మొటిమలకు కారణం అయ్యే హార్మోన్లను తగ్గిస్తూ ఉంటాయి.అలాగే మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.