Cm Jagan : రెండు పార్టీలు తోడుగా ఉంటే, నిలబడలేని చంద్రబాబు..ఒక నాయకుడా ?

cm jagan
cm jagan

Cm Jagan in gudiwada

Cm Jagan : పవన్ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడులకు CM జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదని… ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు కుప్పంలో ఈరోజు ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్ కోసం నన్ను అడుగుతున్నాడని ఆగ్రహించారు. ఇవాళ గుడివాడలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ… కుప్పంలో మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి చేసేస్తాం అంటాడని.. సీఎంగా ఉన్న ఆరోజుల్లో మీ ప్రతి ఇంటికీ ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగలేడని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తానని ప్రకటించారు సీఎం జగన్‌. 99 శాతం నెరవేర్చి ప్రతి అక్కచెల్లెమ్మల వద్దకు వెళ్లి మీకు మంచి జరిగిందా అనే నైతికత మనదని… ప్రతిసారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం చేశాడు ఆ పెద్దమనిషి అంటూ మండిపడ్డారు జగన్‌ ( Cm Jagan ).

రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప నిలబడలేని బాబు మనకు ప్రత్యర్థి అట..175 నియోజకవర్గాల్లో క్యాండేట్లను పెట్టలేని వ్యక్తి మనకు ప్రత్యర్థట అంటూ చురకలు అంటించారు. తాను ఎమ్మెల్యే అవుతానని, ఎవరు ఆపుతారో చూస్తానని అంటున్న దత్తపుత్రుడు మరో వంక అంటూ పవన్‌ కళ్యాణ్‌ పై మండిపడ్డారు జగన్‌.

అధికారంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని దోచుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కలిసిన గజ దొంగల ముఠా అని… ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చని మండిపడ్డారు సీఎం జగన్‌. అబద్దాలన్నీ నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండని… మంచి జరిగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండని కోరారు సీఎం జగన్‌.