Did director Sandeep Reddy Vanga struggle to make Arjun Reddy film?
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలాంటి రెవల్యూషనరీ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా 2017 వ సంవత్సరంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీ ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
పెద్దగా పేరు లేని ఓ హీరోని పెట్టి ఓ కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మొదట దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో కథ రాసుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డి సినిమాని చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఇవ్వరు ముందుకి రాకపోవడంతో సందీప్ తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టి దాదాపు 3 కోట్లతో ఈ సినిమాని తీశారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి సందీప్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట.
ఆస్తుల విషయంలో ఇంట్లో గొడవలు పడుతూనే ఒకానొక సమయంలో అవి పెద్ద వివాదాలకు కూడా కారణమయ్యాయని సమాచారం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంతో కసితో ఈ సినిమాను తీసి విడుదల చేశారు సందీప్. ఇక ఈ సినిమా తీసిన తర్వాత సురేష్ బాబు తనకు అయిన మూడు కోట్లు ఖర్చు ఇచ్చి ఈ సినిమాని కొనుక్కున్నాడని సమాచారం. అయితే కొంత సమయం తీసుకుని బాగా ఆలోచించి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కానీ ఈ సినిమా రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టమో సందీప్ కి తెలిసి వచ్చింది.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఈ చిత్రాన్ని కొనుక్కున్నారని తెలుస్తుంది. ఆ తరువాత ఈ సినిమాని కబీర్ సింగ్ రూపంలో హిందీలో కూడా తీయగా 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హీరోలు సైతం ఆయన వెంట పడ్డారు. కానీ ఎక్కడ తొందరపడకుండా కెరీర్ విషయంలో సందీప్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక త్వరలో ఆనిమల్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు సందీప్.