Friday : పెళ్లి కానీ అమ్మాయిలను శుక్రవారం పూట తిడితే ఏం జరుగుతుందో తెలుసా..?

Friday

Do you know what happens if you marry the girls on friday

Friday : చాలామంది మహిళలు శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఎంతో నియమనిష్ఠలతో పూజిస్తూ ఉంటారు.అయితే కొంతమంది తెలిసి తెలియక శుక్రవారం పూట ఆడవాళ్లు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే పొరపాటున కూడా శుక్రవారం పూట మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.మరి శుక్రవారం పూట చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా సరే శుక్రవారం పూట తలస్నానం అస్సలు చేయకూడదట. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు నమ్ముతున్నారు. అలాగే శుక్రవారం రోజు వేసుకున్న గాజులని అస్సలు తీయకూడదట. అంతేకాకుండా శుక్రవారం పూట ఎవరైనా సరే ఇతరులకు అప్పు గా డబ్బులు,కుంకుమ, పసుపు, ఉప్పు,చీపురు వంటి వస్తువులను ఇవ్వకూడదు.

అలాగే పొరపాటున కూడా పెళ్లైన స్త్రీలు తమ చేతి నుండి కుంకుమ,పసుపులను నేల మీదికి జార విడువరాదు.ఇలా చేస్తే అరిష్టం అని భావిస్తారు. అంతేకాకుండా శుక్రవారం పూట ఆ లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో పూజించడమే కాకుండా సాయంత్రం ఆరు దాటాక తలుపులు అస్సలు వేయకూడదు. ఎందుకంటే శుక్రవారం పూట లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతారు. మరి ఎక్కువగా సాయంత్రం పూట లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాన్ని సాయంత్రం అలాగే తెరిచి ఉంచాలి.

అలాగే ఇంటి కోడలు, ఇంటి ఆడబిడ్డ శుక్రవారం పూట కన్నీళ్లు పెట్టుకోవడం ఇంటికి అరిష్టం.అంతేకాకుండా శుక్రవారం పూట పెళ్లికాని అమ్మాయిలను అస్సలు తిట్టకూడదట.ఒకవేళ అలా తిడితే ఆ కుటుంబానికి దురదృష్టం పట్టుకుంటుందని ఎప్పుడూ కూడా శుక్రవారం పూట అమ్మాయిలను దుర్భాషలాడుతూ వెక్కిరించరాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.