Is there a secreat behind the house warming in gomatha
House Warming : సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరి కల.ఉన్న ఊరిలో ఇల్లు లేకపోతే ఎన్ని రోజులైనా మనకు ఆ ఊరు పరాయి ఊరిలాగే కనిపిస్తుంది. అందుకే సొంత ఊర్లో చిన్న రేకుల షెడ్డు అయినా తమకంటూ ఉండాలి అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇక ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమకోసం ఒక ఇల్లు ఉండాలని సొంత ఊరిలో ఒక ఇల్లు కట్టుకుంటారు.
అయితే గ్రామం అయిన పట్టణమైన ఏదైనా సరే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు చాలా మంది గోమాత తో గృహప్రవేశం చేస్తారు. ముందుగా గోమాత తో గృహప్రవేశం చేయించాకే ఆ తర్వాత బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోకి వెళ్తారు. అయితే గోవుతోనే గృహప్రవేశాన్ని ఎందుకు చేస్తారు అనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు.
అయితే గోవుతో గృహప్రవేశం (House Warming ) చేయించడం వెనక అర్థం వేరే ఉంది.అదేంటంటే గోవు సకల దేవతల స్వరూపం. అందుకే ఆ గోమాతతో ముందుగా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయిస్తే ఆ ఇంట్లోకి గోమాత తో పాటు సకల దేవతలు వస్తాయని మన పూర్వీకుల అలాగే పండితుల నమ్మకం.అందుకే చాలామంది పండితులు గృహప్రవేశం చేసేటప్పుడు గోమాతను ముందుగా కొత్త ఇంట్లోకి ప్రవేశం చేయించమని చెబుతారు.
మరి ముఖ్యంగా కొత్త ఇంట్లోకి గోమాత (Gomatha) ప్రవేశించాక పేడ లేదా మూత్రం పోస్తే ఇంకా మంచిదట.అయితే చాలామంది పట్టణాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటూ ఉంటారు. కానీ అలా అపార్ట్మెంట్స్ లోకి గోమాత ను తీసుకువెళ్లడం కష్టం.అందుకే అపార్ట్మెంట్స్ ముందు గోమాతను తీసుకువచ్చి దానికి అవసరమైన ఆహారాన్ని ఇచ్చి పూజించడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది.