Do you know who is the star hero who missed the villain role in the movie “Dhruva”?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే మరిచిపోలేని హిట్ ఇచ్చిన చిత్రం “ధ్రువ”. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “తన్ని ఒరువన్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ధ్రువ చెర్రీ కెరీర్ లోనే అతిపెద్ద మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమాకి స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి ఆకట్టుకున్నాడు.
రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి కి కూడా మంచి పేరు వచ్చింది. సిద్ధార్థ్ అభిమన్యు గా ఆయన చేసిన పాత్ర మరెవరు చేసినా ఆ రేంజ్ లో గుర్తింపు వచ్చేది కాదేమోనని, సినిమా ఫలితం మీద కూడా ప్రభావం చూపించేది అనే కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర ఇండియాలోనే ది బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు.
అయితే ఈ పాత్ర కోసం మొదట మన టాలీవుడ్ లో కొంతమంది సీనియర్ హీరోలను సంప్రదించారట. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం మొదట కింగ్ నాగార్జునని అనుకున్నారట. ఇందుకోసం నాగార్జునని సంప్రదించి కథ కూడా వినిపించారట. ఈ కథ మొత్తం విని నాగార్జున కూడా ఓకే అన్నారట. కానీ ఆ తర్వాత నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని కూడా సంప్రదించారట.
కానీ కన్నడలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన నెగటివ్ పాత్రలో నటించనని స్పష్టం చేశారట. దాంతో తమిళ్ లో నటించిన అరవింద్ స్వామినే తీసుకున్నారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు నాగార్జున అనవసరంగా మంచి ఛాన్స్ మిస్ మిస్ చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.