Astrology: Today is shani amavasya if you follow this rule today
Astrology: ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ రోజు శనివారం అలాగే శని అమావాస్య కూడా. శని అమావాస్య రోజు ఇలాంటి పనులు గనుక చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని కొంతమంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి శని అమావాస్య రోజు చేయాల్సిన పనులు చేయడం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శని అమావాస్య రోజు కొంతమందికి ఉన్న శని దోషం పోవాలంటే ఈ పనులు చేయాలట. అంతేకాదు ఈరోజు శని దోషం పోగొట్టుకోవడానికి అనువైన రోజు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఎవరికైతే శని దోషం అనేది ఉంటుందో వారు ఈ రోజు ఉపవాసం ఉండి,కేవలం పాలతో, పండ్లతోనే వారి ఆకలిని తీర్చుకొని నియమ నిష్ఠలతో ఆ శని దేవున్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందట.
అలాగే శని దేవుడికి ఇష్టమైన మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆ శని దేవుడికి మన మీద దయ కలుగుతుందట. అలాగే మనపై ఉండే ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలంటే శని అమావాస్య (Shani Amavasya) రోజు నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, నల్ల ఇనుప వస్తువులు, ఆవనూనె,నల్లటి మినప్పప్పు వంటి వాటిని దానం ఇవ్వడం చాలా మంచిదట.
ఈ రోజున ఆ శని దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి నియమ నిష్ఠలతో ఈరోజు ఆ శని దేవుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోయి కోటీశ్వరులు అవుతారని కొంతమంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.