Pawan Kalyan attended to varun tej engagement
Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. అటు ఏపీ రాజకీయాలు, వారాహి యాత్ర అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తన మూడో భార్య అయిన అన్నా లెజ్నెవాకు విడాకులు ఇచ్చేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారంటూ కొంతమంది ఈ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనికి గల కారణాలు కూడా వారు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మెగా కుటుంబంలో ఈవెంట్ జరిగింది. అదే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కార్యక్రమం. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం జూన్ 9వ తేదీన సాయంత్రం జరిగిన సంగతి మనందరికీ విధితమే.

ఈ కార్యక్రమం చాలా సింపుల్ గా మరియు సైలెంట్ గా జరిగింది. కేవలం అల్లు మరియు మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఫంక్షన్కు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. మెగా కుటుంబంలో ఫంక్షన్ కారణంగా… జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందర్నీ… ఆకట్టుకున్నారు. డిఫరెంట్ స్టైల్ లో ఈ ఈవెంట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్… లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ లను ఆశీర్వదించారు. అయితే ఇక్కడే ఉంది అసలు సమస్య. ఈ కార్యక్రమానికి తన మూడో భార్యతో రాకుండా.. సింగిల్ గా వచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఇద్దరు భార్యలకు చేసిన అన్యాయమే… రష్యా కు చెందిన మూడో భార్య అన్నా లెజ్నెవాకు కూడా పవన్ కళ్యాణ్ చేసేందుకు సిద్ధమయ్యాడని కొంతమంది రెచ్చిపోయి కామెంట్లు పెట్టాడు. తన మూడో భార్యకు, పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే.. మెగా కుటుంబంలో ఫంక్షన్కు సింగిల్ గా వచ్చాడని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వీరు త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని కూడా కొంతమంది అర్థం లేని కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.