Relationship: If you keep this one item in the cupboard in the bed room
ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతూ తమ బంగారు భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. ఇక ఈ రోజుల్లో పని ఒత్తిడి,ఇంకా ఇతర కారణాలు,డబ్బు వల్ల ఏర్పడిన ఒత్తిడితో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. కొంతమంది భర్తలు ఆఫీస్ నుండి పని ఒత్తిడితో ఇంటికి వచ్చాక భార్య ప్రేమగా పలకరించక పోయేసరికి కూడా వారిద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలు వస్తాయి.
ఇంకొంత మందికి బంధువుల అలాగే అత్తమామల విషయంలో గొడవలు వస్తాయి. మరికొంతమందికి డబ్బు విషయంలో,అలాగే ఇతర అమ్మాయిల విషయంలో గొడవలు వస్తాయి. ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు అయితే పిల్లల విషయంలో కూడా గొడవలు వస్తాయి.అంతేకాకుండా ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటే నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనే భావన పెరిగిపోయి ఇద్దరి మధ్య ఈగో అనేది పెరుగుతుంది.ఈ కారణంతో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.
అయితే భార్య భర్తల మధ్య గొడవలు పెరగకుండా వారు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ ఒక్క నియమాన్ని పాటించాలి అని కొంతమంది ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరి భార్యాభర్తల మధ్య గొడవలు పోయి ఎప్పటికీ కలిసి ఉండడానికి చేయాల్సిన ఆ పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఇంట్లో పడకగది అనేది ఉంటుంది.
ఆ పడగదిలో ఉండే అల్మారా లో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పుని వేసి ఆ గిన్నెను అల్మారా లో పెట్టుకోవాలి. ఇక ఈ రాళ్ళ ఉప్పు కలిగిన గిన్నెని వారానికి ఒకసారి మార్చుతూ ఉంటే దంపతుల మధ్య గొడవలు పోయి ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇక ఎవరికైతే గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయా అలాంటివారు ఒకసారి దీన్ని పాటించండి.