Revanth Reddy statement on telangana
Telangana Congress : తెలంగాణ రాష్ట్రంలో మరో 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సారి ఎలాగైనా… కేసీఆర్ సర్కార్ ను ఓడించేందుకు.. బీజేపీ పార్టీతో పాటు…. కాంగ్రెస్ పార్టీ ఆతృతగా ఉన్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ( Telangana Congress ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు.
2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు రేవంత్. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో కూడా వివరించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని… ఆరోగ్య శ్రీ పరిధి పెంచుతామని వెల్లడించారు. రైతు పండించిన పంట చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొంటామని… రైతులకు2 లక్షల రుణ మాఫీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

ఏడాది లోపు ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీ భర్తీ చేస్తామని…గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఆడ బిడ్డలకు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నల్లమల అడవి బిడ్డలు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. నా పరువు సమస్య కాదని… 14 సీట్లు గెలిపించి పాలమూరు పరువు నిలబెడధామన్నారు రేవంత్ రెడ్డి ( revanth reddy ).
కేసీఆర్ దోపీడికి 4 కోట్ల ప్రజలు బలి అయ్యారని… పదేళ్లలో ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణ రాష్ట్రంగా మార్చారని నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇక కేసీర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదని… తెలంగాణను కేసీఆర్ నుంచి విముక్తి కలిగించెందుకే ఈ చేరికలన్నారు. ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని… ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.